ఆంధ్రప్రదేశ్‌

20 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: ఈ ఏడాది చివరి నాటికి 20 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్‌లను నిర్మిస్తామని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ అన్నారు. కృష్ణాజిల్లా ముదినేపల్లిలో గురజ పాఠశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 6 లక్షల టన్నుల ఉత్పత్తులను నిలువ చేసే గిడ్డంగులను నిర్మించామన్నారు. వీటికి తోడు ప్రైవేట్ రంగంలో కూడా 8 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులను నిర్మించారన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 4 లక్షల టన్నుల ఉత్పత్తులు నిలువ చేసే గిడ్డంగులను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించామని ఆయన అన్నారు. రైతులు తాము పండించే ఉత్పత్తులను నిలువ చేసేందుకు ఎక్కువ శాతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గిడ్డంగుల అవసరం ఉందని అన్నారు. ఆక్వా రంగానికి సంబంధించి ఉత్పత్తులు నిలవ చేసేందుకు కోల్డు స్టోరేజీ గిడ్డంగులను నిర్మించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారన్నారు. ఆక్వా రంగానికి సంబంధించి చేప, రొయ్యలను గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కోల్డు స్టోరేజీలో భద్రపరచుకునే విధంగా గోడౌన్‌లు నిర్మిస్తామన్నారు.