ఆంధ్రప్రదేశ్‌

ఏపీ హక్కుల కోసం పోరాటం: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో పోరాటం కొనసాగిస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు. రఘువీరారెడ్డి శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశంల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాలని అధినాయకత్వాన్ని కోరినట్టు స్పష్టం చేశారు. అవసరమైతే కేంద్రపై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశం కూడా పరిశీలింస్తుందని ఆయన చెప్పారు. విభజన సమయంలో యూపీఏలోని కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించేలా ఏపీకి అన్యాయం చేసే విధంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిడ్ దాఖలు చేసిందని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అంశంపై సోమవారం జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. గత పార్లమెంట్ సమావేశాలలో యూపీఏ భాగస్వామ్య పార్టీలను ఒప్పించి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పారిపోయిందని ఏద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాలలోనైనా ఏపీకి న్యాయం జరగకపోతే ప్రజలకు పార్లమెంట్ మీద ఉన్న నమ్మకం పోతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందనే డొక్కా మాణిక్యవరప్రసాద్ అనసరమైన విమర్శలు చేస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే బాగుండేదని మండిపడ్డారు.