ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’లో మీ జోక్యమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 14: జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే నిధులు మంజూరు చేస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యమేమిటని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రమే పూర్తి బాధ్యతతో పోలవరం ప్రాజెక్టును అనుకున్న ప్రకారం పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. తాను అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు గురించి కనీసం ఆలోచన చేయలేదన్నారు. అప్పట్లో తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి కృష్ణంరాజు, మాజీ ఎంపీ గిరజాల స్వామి నాయుడు గ్రామ,గ్రామానికి గోదావరి జలాలు పేరిట పాదయాత్ర చేశారన్నారు. అంతకు ముందు టీడీపీ చెందిన వడ్డి వీరభద్రరావు పాదయాత్ర చేసి అప్పటి ప్రధాని దేవెగౌడ్‌కు పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతపై వినతిపత్రం ఇచ్చారన్నారు. అయితే బీజేపీ మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టుపై పోరాడుతోందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు బీజేపీ తెలంగాణ నాయకులు పోలవరంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో రాజమండ్రిలో సమావేశంలో పోలవరానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ ముంపు మండలాలు తెలంగాణలో ఉంచగా, బీజేపీ అధికారం చేపట్టిన అనంతరం తొలి కేబినెట్‌లోనే ఆర్డినెన్స్ ద్వారా వాటి ఏపీలో కలిపామన్నారు. అప్పట్లోదీనిపై పెద్ద కసరత్తే జరిగిందని వీర్రాజు వివరించారు. పోలవరం -సోమవారం అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు కేంద్ర ప్రాజెక్టును కేంద్రానికి వదిలిపెట్టి హంద్రీనీవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. ఇక కేంద్రం మంజూరు చేసిన నిధులతో సాధికార మిత్రల సమావేశాలు నిర్వహిస్తూ ప్రధాని మోదీని విమర్శించే కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగట్టారు. తాను చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై అభాండాలు వేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ఉపాధి హామీ పథకంలో నీరు-చెట్టు పథకం పేరిట రూ.13వేల కోట్లు నిధుల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఈ నిధులతో ఎన్నో పథకాలు చేపట్టవచ్చన్నారు. అలాగే రాష్ట్రానికి అర్బన్ హౌసింగ్ పథకం కింద 7 లక్షల ఇళ్లు కేటాయించగా, ఐదు లక్షల ఇళ్లు ప్రభుత్వమే భూమి కేటాయించి నిర్మిస్తోందన్నారు. ఈ విధంగా ఒక్క హౌసింగ్ ప్రాజెక్టులోనే రూ.28వేల కోట్ల దోపిడీ జరిగిందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు టీడీపీ నేతలు దోచేందుకు వెనుకాడట్లేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, నగర పార్టీ అధ్యక్షుడు నాగేంద్ర పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు