ఆంధ్రప్రదేశ్‌

సన్నిధిగొల్ల సంభావన అంశాన్ని త్వరగా పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 23: చట్టసభల్లో చర్చకు రాని అంశాలను శాసనసభ ఫిర్యాదుల కమిటీ పరిశీలించి పరిష్కరిస్తుందని ఆ కమిటీ చైర్మన్, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. సోమవారం ఉదయం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో శాసనమండలి ఫిర్యాదుల కమిటీ టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హౌస్ కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ వద్దకు తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధిగొల్ల సంభావన అంశం ఉందన్నారు. దీనిపై తిరుమల జేఈఓ పోలా భాస్కర్ సమాధానమిస్తూ 2007లో ప్రభుత్వ ఉత్తర్వులు సవరించాల్సిన అవసరం ఉందని ప్రతిపాదన పంపించామన్నారు. త్వరలో జరగనున్న బోర్డు సమావేశంలో ఈ విషయమై చర్చించి ప్రభుత్వానికి నివేదిక మరోమారు పంపిస్తామన్నారు. శెట్టిపల్లి పంచాయతీలో 500 ఎకరాల భూమి విషయమై కలెక్టర్ మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ విధానంలో ఆ భూమిని అభివృద్ధి చేయాలని తుడాకు సూచించామని వివరించారు. ఈ విషయమై హౌస్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఈ అంశాన్ని మరోసారి సమీక్షించి 15రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు.