ఆంధ్రప్రదేశ్‌

జీఎస్‌టీ కౌన్సిల్‌ను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కేంద్రప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్‌ను నిర్వీర్యం చేస్తోందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కేంద్రానికి, జీఎస్‌టీ కౌన్సిల్ మధ్య సమన్వయలోపం కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సోమవారం ఒక ప్రకటనలో యనమల తెలిపారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఆలోచనలను రాష్ట్రాలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సామాన్య ప్రజలు ఎదుర్కొనే అనేక అంశాలపై ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారని మండిపడ్డారు. కేంద్రానికి ఎక్కడ లాభం వస్తుందో అక్కడే శ్రద్ద చూపుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అధికారుల కమిటీలను, బీజేపీ మంత్రుల కమిటీలను నియమించి కేంద్రానికి లాభకరమైన అంశాలను ఆమోదించి అంతా కేంద్రమే చేస్తున్నట్లు నటిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్ పిలుపు ఎందుకో వివరించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో అవిశ్వాసం సందర్భంగా వైసీపీ ఎంపీలు హాజరుకానందుకా? అవకాశవాద రాజకీయాల కోసమా అనేది తేల్చాలన్నారు. అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చలో పాల్గొనకుండా తప్పించుకోవటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించినందుకు బంద్ పాటిస్తున్నారేమో ప్రజలకు వివరించాలన్నారు. రాజీనామాలు చేయటం ద్వారా లోక్‌సభలో మేజిక్ ఫిగర్ తగ్గించి బీజేపీకి మేలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికలు రాకుండా చూసుకుని వైసీపీ ఎంపీలు రాజీనామా చేయటం నూరుశాతం బీజేపీతో కలసి ప్రయాణిస్తోందనటానికి నిదర్శనాలుగా చెప్పారు. ఏపీకి ద్రోహంచేసిన బీజేపీ వెనుక మూలస్తంభాలుగా వైసీపీ, జనసేన చేరాయని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. అధికారం, ముఖ్యమంత్రి కుర్చీపైనే ఆ రెండు పార్టీల ధ్యాస ఉందని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని త్వరలో తగిన గుణపాఠం చెప్తారని స్పష్టంచేశారు.