ఆంధ్రప్రదేశ్‌

పనుల్లో వేగం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 23: అధికారులు ఏదో చేశామని చేతులు దులుపుకుంటే కుదరదు.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.. అలసత్వం లేకుండా వేగవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం రహదార్లపై నీరునిల్వ ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం వారం రోజుల పాటు ప్రత్యేకడ్రైవ్ చేపట్టాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు, కళాశాలల విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు.ప్రతి శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులపై అన్ని ముఖ్యశాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహనిర్మాణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పాఠశాల విద్య, మత్స్యశాఖ, పశుసంవర్థక, జలవనరులు, వ్యవసాయ, ఉద్యానవనాలు, మెప్మా, సెర్ప్ అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన పనుల పురోగతి, నిధుల వినియోగంపై నివేదించారు. పశు సంవర్ధకశాఖలో రూ 21లక్షల అంచనా వ్యయంతో 20 గోవులకు ఒక ‘గోకులం’ చొప్పున నిర్మాణాలు చేపట్టామని ముఖ్యమంత్రికి వివరించారు. 2,4,6 పశువుల చొప్పున మినీ గోకులాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ‘పశుసఖి’ కార్యక్రమాన్ని వ్యవస్థీకృతం చేసి మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, సెర్ప్ దీనిపై మరింత దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామానికి డ్వాక్రా లేదా గోపాలమిత్ర సేవలు ఖచ్ఛితంగా అందాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది 3616 ఆటస్థలాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్ని అవసరమైతే అన్ని ఏర్పాటు చేయాలని ఈ విషయంలో రాజీపడవద్దని సూచించారు. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలకే కాకుండా జాగింగ్ ట్రాక్‌గా ఈ క్రీడాస్థలాలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రహరీ నిర్మాణాలకు అవసరమైన నిధులు అందించినా పూర్తిచేయటం లేదని, వచ్చే వారంలోగా పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో రెండు విడతలుగా 817 క్రీడాస్థలాలను నరేగా నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర మొత్తం 22వేల పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవని పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి ముఖ్యమంత్రికి వివరించారు. దశలవారీగా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్లాంటేషన్ కార్యక్రమం నూరుశాతం పూర్తికావాలన్నారు. ప్రతి విద్యాలయంలో విధిగా న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయాలని కోరారు. వీటి బాధ్యతలను స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలన్నారు. సెరికల్చర్ కింద రూ 3.53 కోట్ల నరేగా నిధులతో 3801 ఎకరాల్లో మల్బరీతోటల పెంపకం చేపట్టామని అధికారులు తెలిపారు. రూ 2.35 కోట్ల వ్యయంతో 1033 పట్టుపురుగుల పెంపకం షెడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమలో 4,5 సెరీకల్చర్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న కర్ణాటకను ఈ ఏడాది అధిగమించాలని ఇందుకు అవసరమైన ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. నిధుల గురించి ఆలోచించ వద్దన్నారు. ఫిషరీస్ రంగం ఒక ప్రధాన అభివృద్ధి వనరుగా ఉందని, అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించటంతో పాటు కాలుష్య నియంత్రణపై దృష్టిసారించాలన్నారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో నిర్మించిన పంటకుంటలలో చేపల పెంపకం చేపట్టిన వైనాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సీఎం స్పందిస్తూ ఈ తరహా కృషిని ప్రోత్సహించాలన్నారు. రూ 14.26 కోట్లతో 1742 పంటకుంటల నిర్మాణాన్ని నరేగా నిధులతో చేపట్టామని అధికారులు తెలిపారు. కోస్తా ప్రాంతంలో కోటీ 18 లక్షలతో 534 ఫిష్ డ్రయింగ్ యార్డులను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. రూ 38లక్షలతో 172 అప్రోచ్ రహదారుల నిర్మాణం చేపట్టామని, నరేగా కింద అటవీశాఖలో రూ 27.94 కోట్ల వ్యయంతో మొత్తం 42వేల 784 పనులు చేపట్టామని వివరించారు. 2029కి ఉద్యానవన శాఖలో కోటి ఎకరాల్లో పండ్లతోటల పెంపకం లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవెన్యూ ప్లాంటేషన్, ఫారెస్ట్ ప్లాంటేషన్ పనుల్లో మరింత వేగం పుంజుకోవాలని సూచించారు. సెర్ప్‌లో వృక్షమిత్ర వాలంటీర్లను చేర్చుకోవాలన్నారు. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకు వచ్చే వారి సహాయం తీసుకోవాలని నరేగా పనులు ఆ శాఖ క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రధానశాఖలు చేతులు దులుపుకుంటే కుదరదు.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి స్పీడ్ పెంచాలన్నారు.