ఆంధ్రప్రదేశ్‌

జనసేన కమిటీలు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), జూలై 23: జనసేన పార్టీ ఎట్టకేలకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రాజకీయ కమిటీతో పాటు పార్టీ వ్యవహారాల కమిటీలను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతినిధులను కూడా నియమించింది. విజయవాడలోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో సోమవారం నేతలతో విస్తృతంగా చర్చించిన అనంతరం కమిటీ నేతలను ఎంపిక చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కన్వీనర్‌గా మాదాసు గంగాధరంను ఎంపిక చేశారు. సభ్యులుగా తోట చంద్రశేఖర్, అర్హం యూసుఫ్‌లు ఉండనున్నారు. ప్రస్తుతం మీడియా హెడ్‌గా ఉన్న పి హరిప్రసాద్‌ను పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శిగా ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో జిల్లా వ్యవహాల కోసం రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని నియమించారు. దీనికి కన్వీనర్‌గా సిఎస్ పార్థసారధి వ్యవహరిస్తారు. డాక్టర్ సునిధి, యశశ్వని, సుజాతా పాండా, సయ్యద్ బాబు, తిరుపతిరావుగద్దె, డా హరిప్రసాద్, రవికుమార్ మండవ, డేవిడ్ రాజు, షేక్ నయూబ్ కమల్, అశోక్ యాదవ్, రవి ప్రసాద్, బైరా దిలీప్, రాధాకృష్ణమూర్తి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర బూత్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్‌గా షేక్ రియాజ్ నియమితులైయ్యారు. కమిటీలో యర్నాగుల శ్రీనివాస్, వరుణ్, సురేశ్ చింతా, సతీష్‌కుమార్ వనె్నంరెడ్డి సభ్యులుగా వ్యవహరించనున్నారు. జనసేన కేంద్ర లీగల్ సెల్ చైర్మన్‌గా కె చిదంబరం నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీఐ కమీషన్‌గా బాధ్యతలు నిర్వహించిన పి విజయబాబును పార్టీ అధికార ప్రతినిధిగా అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు.