ఆంధ్రప్రదేశ్‌

నేత కార్మికులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 23: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. చేనేతలకు అందిస్తున్న రుణాలు.. సబ్సిడీ పథకాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా తదితర అంశాలపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆదరణ-2 పథకం కింద 60వేల 497 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 70వేల చేనేత కార్మికులకు మోటరైజ్డ్ జూక్వార్డ్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ముద్రా పథకం 7 శాతం వడ్డీ సబ్‌వర్షన్‌ను కేంద్రం మంజూరు చేసిందన్నారు. 2017-18లో 10వేల 209 మంది చేనేత కార్మికులకు రుణాలు మంజూరు చేశామని వివరించారు. బ్యాంకుల ద్వారా చేనేతలకు ముద్రా పథకం కింద మంజూరుచేసిన రుణాల మొత్తం 52.27 కోట్లు కాగా 2018-19లో 14వేల 180 మంది చేనేతలకు రూ 70.29 కోట్లు మంజూరు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 5465 ఈ దరఖాస్తులు అందాయని రూ 2975 కోట్ల మేర రుణాల మంజూరుకు సిఫార్సు చేశామన్నారు. రాష్ట్రంలో పవర్‌లూమ్‌ల సంఖ్య 21వేల 500 కాగా 2018-19లో రూ 5.82 కోట్లతో 3800 మగ్గాల ఆధునికీకరణ చేపట్టామన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం సబ్సిడీని అందిస్తున్నాయి. మరమగ్గాల ఆధునీకరణతో మెరుగైన వస్త్రాలు తయారీ చేయాలని మరింత మన్నికగా ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

చిత్రం..మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి చేనేత, జౌళిశాఖపై
సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు