ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరం కలిసి హోదా కోసం పోరాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: హైదరాబాద్‌ను ఇద్దరం పంచుకుని, ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని తెలంగాణ నేతలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే, తమకూ ఇవ్వాలని తెలంగాణ నేతలు కోరడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ ఆదాయం, ఇతర వనరులు లేని ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, తమకీ ఇవ్వాలని తెలంగాణ నేతలు కోరడం సరికాదన్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ లాభపడిందని, ఉమ్మడి ఏపీలో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను వదిలేసి వచ్చామని గుర్తు చేశారు. 2014 తరువాత పరిపాలన సాగించడానికి కనీసం కూర్చునేందుకు జాగా లేని స్థితిలో పాలన కొనసాగించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ నేతలు సహకరించాలన్నారు. తమకూ ప్రత్యేక హోదా కావాలని తెలంగాణ కోరడంలో తప్పు లేదని, కానీ ఏపీతో ముడిపెట్టి కోరడం సరికాదన్నారు.