ఆంధ్రప్రదేశ్‌

టెండర్ల రద్దుకు సిఫార్సు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 19: గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇంత వరకు కేవలం 40శాతం పనులు మాత్రమే జరగటంతో పనులు ప్రారంభంకాని ప్యాకేజీల టెండర్లను రద్దుచేయాలని జలవనరులశాఖ సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తోంది. గోదావరి డెల్టా ఆధునికీకరణలో భాగంగా కాలువల వ్యవస్థతో పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థను కూడా ఆధునికీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.3361కోట్లు మంజూరు చేసింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు రూ.1697కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాకు రూ.1664కోట్లు మంజూరయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో రూ.1015కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారయితే ఇప్పటి వరకు జరిగిన పనులు విలువ సుమారు రూ.442కోట్లు. సుమారు రూ.573కోట్లు విలువైన పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదు. పశ్చిమగోదావరికిమంజూరైన రూ.1664కోట్లు విలువైన పనుల్లో రూ.600కోట్లు విలువైన పనులు జరిగినట్టు సమాచారం. మిగిలిన పనులకు టెండర్లు ఖరారుకాకపోవటం, టెండర్లు ఖరారయినా పనులు ప్రారంభంకాకపోవటం తదితర పరిణామాల నేపథ్యంలో గోదావరి డెల్టా ఆధునికీకరణ కార్యక్రమాన్ని పునఃసమీక్షించాలని రాష్ట్రప్రభుత్వం చాలా కాలంగా భావిస్తున్న సంగతి విదితమే. దీనిపై ఇప్పటికే నిపుణుల కమిటీని కూడా రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. డెల్టా ఆధునికీకరణలో అత్యవసర పనులను మాత్రమే చేపట్టి, అంతగా ప్రాధాన్యత లేని పనులను రద్దుచేయాలని నిపుణుల కమిటీ కూడా రాష్ట్రప్రభుత్వానికి సిఫార్సుచేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జలవనరులశాఖ అధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులు ప్రారంభంకాని ప్యాకేజిల్లోని టెండర్లను రద్దుచేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. పనులు ఎందుకు ప్రారంభించలేదని కాంట్రాక్టు సంస్థలను గట్టిగా ప్రశ్నించేందుకు జలవనరులశాఖ వద్ద అధికారం లేకుండా పోయింది. పనులు ప్రారంభించకపోవటం కాంట్రాక్టు సంస్థల వైపు నుండి పొరపాటు ఉన్నట్టే, పనులు ప్రారంభించేందుకు అవసరమైన వాతావరణాన్ని జలవనరులశాఖ కల్పించలేకపోయింది. కనీసం రెండేళ్లపాటు దీర్ఘకాలం కాలువలను మూసివేస్తే తప్ప ఆధునికీకరణ పనులు చేపట్టడం సాధ్యంకాదు. ఒక ఏడాది రబీ పంటకు అవకాశం లేకుండా కాలువలు మూసివేస్తే ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు రూ.5వేల కోట్ల ఆదాయాన్ని రైతులు కోల్పోతారు. అలాంటిది రెండేళ్ల పాటు రబీకి అవకాశం లేకుండా పంటకు విరామం ఇస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు.