ఆంధ్రప్రదేశ్‌

అర్చక, బ్రాహ్మణ సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 26: దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా అర్చక, బ్రాహ్మణ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పాటుబడుతోంది తెలుగుదేశం ప్రభుత్వమేనని టీడీపీకి చెందిన శాసనమండలి సభ్యుడు టిడి జనార్ధన్ పేర్కొన్నారు. రాష్ట్ర అర్చక సమాఖ్య, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యదర్శి సిరిపురపు శ్రీ్ధర్ నేతృత్వంలో గురువారం ఎమ్మెల్సీ జనార్ధన్‌ను కలిసి వంశ పారంపర్య అర్చక సర్వీసు రూల్స్‌కు సంబంధించి జీవో 76 తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జనార్ధన్ మాట్లాడుతూ గతంలో ఇప్పటివరకు దేశంలోని ఏ ముఖ్యమంత్రి బ్రాహ్మణ సంక్షేమం కోసం పాటుపడిన దాఖలాలు లేవని, కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. వంశ పారంపర్య అర్చకులకు సంబంధించి జీవో 76 ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను, అర్చక సర్వీసు రూల్స్‌ను దేశంలోనే తొలిసారిగా ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని అన్నారు. జీవో 76 ద్వారా అర్చక సర్వీసు రూల్స్‌కు చట్టబద్ధత కల్పించి తుది నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు ఎస్ నందీశ్వర్, రాష్ట్ర నాయకులు జంధ్యాల రామలింగేశ్వరశాస్ర్తీ, కెఎన్‌ఆర్ ఆచార్యులు, మోదుకూరు సాయికుమార్, ఎంఎ శేషాచార్యులు, కళ్లేపల్లి ఫణికుమార్, కె కిరణ్‌కుమార్, అప్పలాచార్యులు తదితరులు ఉన్నారు.