ఆంధ్రప్రదేశ్‌

రైతుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకునే జగన్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 26: నవ్యాంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, రైతులను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు బి జయనాగేశ్వరరెడ్డి, ఏలూరు సాంబశివరావు ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్‌టి ఆర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయనన్ని పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అందించి రైతుబిడ్డగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కుదేలైన వ్యవసాయరంగాన్ని పునరుద్ధరించి లాభాల బాట పట్టించడంతో పాటు రైతులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు గత నాలుగేళ్లలో 80 వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందన్నారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వ్యవసాయంలో 17.44 శాతం, ఆక్వాలో 42.73, పశు సంవర్ధక శాఖలో 13.68, ఉద్యానవనంలో 18.62 శాతం వృద్ధిని నమోదు చేశాయన్నారు. దేశంలో 24 వేల కోట్ల ఉప శమనాన్ని రైతులకు అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర సృష్టించారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కౌలురైతులను ఆదుకుని రికార్డుస్థాయిలో రూ.3 వేల కోట్ల రుణాలను పంపిణీ చేసిందని చెప్పారు.
గత నాలుగేళ్లలో 94.46 లక్షల మట్టి నమూనా కార్డులను పంపిణీ చేసి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది కరవు ప్రభావిత ప్రాంతాల్లో 31,595 క్వింటాళ్ల విత్తనాలను నూరుశాతం సబ్సిడీపై అందజేసి రైతులకు ప్రభుత్వం చేయూతనిచ్చిందని పేర్కొన్నారు.