ఆంధ్రప్రదేశ్‌

భూములిచ్చిన రైతుల త్యాగాన్ని అవమానించేలా పవన్‌తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 26: ప్రజా రాజధాని అమరావతిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ యత్నిస్తున్నారని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. గురువారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రకు రాజధాని లేకుండా పోయిందని, ఇలాంటి తరుణంలో అనుభవజ్ఞులు, దక్షత కల్గిన నాయకుడు రాష్ట్రానికి అవసరమని గతంలో మాట్లాడిన పవన్, ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం రాజధానికి ఇచ్చిన భూముల విషయంలో బురదజల్లడం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నవ్యాంధ్ర రాజధాని కోసం రైతులు, బడుగు, బలహీనవర్గాలు, దళిత రైతులు 33 వేల ఎకరాలకు స్వచ్ఛంధంగా ఇచ్చారన్నారు. 98 శాతం రైతులు భూ సమీకరణ విధానంలో సంతోషంగా భూములు ఇచ్చారని, ఇతర రైతులతో పాటు రాజధాని కోసం భూములు ఇచ్చిన దళిత రైతులు కూడా ప్రభుత్వం ఇచ్చిన పరిహారం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.
దళిత రైతులకు పరిహారంతో పాటు పెన్షన్, ఉపాధి శిక్షణ వంటి ఇతర ప్రయోజనాలను కల్పించడం జరిగిందన్నారు. రాజధాని ప్రాంతంలో ఎవరెంత రెచ్చగొట్టినా ప్రజలు చంద్రబాబు నాయుడుపై ఉన్న విశ్వాసంతో వారి ప్రయత్నాలను వమ్ము చేశారని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి రాజధాని రైతులను రెచ్చగొట్టాలని చూసి ఫలితం లేకపోవడంతో పారిపోయారని ఎద్దేవాచేశారు. ప్రస్తుతం రాజధానిలో వౌలిక సదుపాయాల కల్పన అత్యంత వేగంగా జరుగుతోందని, కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి పవన్‌కల్యాణ్ దీక్ష చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని పవన్‌కల్యాణ్ అవమానిస్తున్నారని, ఏ మాత్రం అవగాహన లేకుండా, రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని గమనించకుండా పవన్ చేస్తున్న దీక్షను రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గ్రహించాలని మంత్రి ఆనందబాబు హితవుపలికారు.