ఆంధ్రప్రదేశ్‌

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి మార్గం సుగమం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాష్ట్రంలోని 14 యూనివర్శిటీల్లో పదిహేనేళ్ల నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామాకాలు జరగడం లేదు. దేశంలోనే అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఒకటైన ఆంధ్రా యూనివర్శిటీలో తగినంత ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యా బోధన అంతంతమాత్రంగా జరుగుతోంది. రాష్ట్రంలోని ఏ యూనివర్శిటీలోనూ నాణ్యమైన విద్య అందకపోవడానికి ఆచార్యులు లేకపోవడమే ప్రధాన కారణం. ఒక్క ఆంధ్రా యూనివర్శిటీలోనే సుమారు 400 ఆచార్యుల పోస్ట్‌లను భర్తీ చేయాల్సి ఉంది.
ఈ ఏడాది ఎలాగైనా అన్ని వర్శిటీల్లో పోస్ట్‌లను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించి ఈ ప్రక్రియ కోసం ఏపీపీఎస్సీకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే బాధ్యత అప్పగించింది. ఆ మేరకు రాష్టవ్య్రాప్తంగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, కేటగిరీలవారీగా సుమారు 55 సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థుల మార్కులను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలోని 14 యూనివర్శిటీల్లో 1385 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులే 1110 వరకూ ఖాళీగా ఉన్నాయి. వీరిలో ఫ్రొపెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లను మినహాయించి, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్ట్‌ల నియామకాలకు ఏపీపీఎస్‌సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈమేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఆయా యూనివర్శిటీల్లో అసిస్టెంటెంట్ ప్రొఫెసర్లుగా ఇప్పటికే పనిచేస్తున్న వారు కూడా ఈ పరీక్షలు రాయాల్సిందేనన్న నిబంధన విధించింది. దీంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు దీనికి అభ్యరంతరం తెలియచేశారు. యూజీసీ 100 పాయింట్ ఫార్ములా కిందే తమను ఎంపిక చేశారని, ఇప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల కింద విధులు నిర్వర్తిస్తున్నామని, అందువలన ఈ పరీక్షలు తాము రాయనవసరం లేదని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కానీ ప్రభుత్వం అందుకు ససేమిరా అనడంతో వీరు కోర్టుకెక్కారు. అలాగే, తమకు ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా తమను రెగ్యులరైజ్ చేయాలని, లేకుంటే టైం స్కేల్ ఇవ్వాలని పట్టుపట్టారు. దీంతో మాజీ వైస్ ఛాన్స్‌లర్లు అల్లం అప్పారావు, ప్రభాకరరావు, మాజీ ఐఎఎస్ అధికారి ఈవిఎస్ వెంకటరమణ, ఉన్నవిద్యాశాఖ కార్యదర్శి వరదరాజులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సంప్రదింపులు జరిపిన తరువాత వీరికి టైంస్కేల్ ఇవ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత గత ఏప్రిల్‌లోనే ఈ కమిటీ పూర్తి స్థాయి నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించి, వివిధ శాఖల విభాగాధిపతులతో ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు టైంస్కేల్ ఇచ్చే అంశంపై చర్చించారు. మరోపక్క ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఈ పరీక్షల్లో పాల్గొంటే, వారికి ఇంటర్నల్ వెయిటేజ్ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. దానికీ వాళ్లు అంగీకరించకుండా కోర్టులో కేసును ముందుకు నడిపిస్తున్నారు. మార్చి 10 వరకూ ఆంధ్ర, నాగార్జున యూనివర్శిటీల పరిధిలో దీనికి సంబంధించి పరీక్షలు నిర్వహించకూడదంటూ కోర్టు స్టే ఇచ్చింది. అయితే, ఈ రెండు యూనివర్శిటీలు మార్చి తొమ్మిదో తేదీనే పరీక్షలు నిర్వహించంతో, కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్టయింది. దీంతో ఈ రెండు యూనివర్శిటీల యాజమాన్యాలు కోర్టు ముందు హాజరు కావల్సి వచ్చింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, అందువలన పరీక్షను నిర్వహించామని యాజమాన్యాలు పేర్కొన్నాయి. అయితే, ఏపీపీఎస్‌సీ నిర్వహించిన పరీక్షలకు కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా హాజరు కావడం గమనార్హం. మొత్తంమీద పరీక్షల ప్రక్రియను యూనివర్శిటీలు పూర్తి చేసి, సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది.
ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు కె.అర్జునుడు మాట్లాడుతూ తమకు టైం స్కేల్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. దీనివలన సుమారు అనేకమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు లబ్ధి పొందుతారన్నారు.