ఆంధ్రప్రదేశ్‌

చరిత్రహీనుడిగా మారొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని అడ్డుకుని చరిత్ర హీనులుగా నిలవద్దని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే వైసీపీ సభ్యులు ఇంట్లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. అవకాశం వచ్చినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించకుండా లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. పదహారు నెలలు చంచల్‌గూడా జైలులో ఉండి పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటలేదని మాట్లాడడం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు. పోలవరం ప్రాజెక్టును చూసి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని అంతేకాని అవగాహన లేకుండా మాట్లాడితే అభాసుపాలవుతారన్నారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా రైతులు, వివిధ వర్గాల ప్రజలు 50,870 మంది సందర్శించారన్నారు. పురుషోత్తపట్నం రెండోఫేజ్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు నెలలో ప్రారంభిస్తారన్నారు.
జగన్ అనుయాయులు హైకోర్టులో, నేషనల్ గ్రిన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయడంతో అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. పట్టిసీమ ఉంచి ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీకి 20 టీఎంసీల నీటిని తీసుకువచ్చామని గోదావరి డెల్టాకి 39 టీఎంసీలు నీటిని వాడుకున్నామన్నారు. ఇప్పటి వరకు గోదావరి నది నుంచి 491 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 420 కేసుల్లో ముద్దాయిలను నిలబెట్టాలని జగన చూస్తున్నారని తెలిపారు. ఆకాశంపై ఉమ్మేస్తే తిరిగి మనమీదే పడుతుందని జగన్ గమనించాలని, పోలవరంలో పనులు ఆపకూడదని పోలీసు బందోబస్తుతో సిమెంట్ బస్తాలు పంపిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 224 ఎంఎం వర్షం పడాల్సి ఉండగా 208 ఎంఎం పడిందని దీంతో -6.9 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందన్నారు. రాష్ట్రంలో మెరుగైన జలసంరక్షణ చర్యలు చేపట్టడం వల్ల రెండు మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయని ఆయన తెలిపారు.