ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో తొలిసారిగా సృజనాత్మక ఆవిష్కర్తల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: ప్రత్యాహ్నయ వ్యాపార పద్ధతులు, సృజనాత్మకతో కూడిన వనరుల వినియోగం, స్థిరమైన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన సాంకేతికతలు, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణల సందర్శన వేదికగా విజయవాడ నిలవనుంది. నవ్యాంధ్రలో తొలిసారిగా మినీ మేకర్ ఫెయిర్ నిర్వహించాలని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సంకల్పించింది. విజయవాడ పీబీ సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణం ఈ వేడుకలకు వేదికగా నిలవనుంది. దీనికి సంబంధించి కళాశాల మైదానంలో స్టాళ్ల నిర్మాణంతోపాటు ఇతర ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రాష్ట్రంలో తయారైన వినూత్న ఆవిష్కరణలు, ఉత్పత్తులు, సృజనాత్మక సాంకేతికతలు, నమూనాలకు దర్పం పట్టేలా నవ్యాంధ్రలో తొలిసారి మినీ మేకర్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో, ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఈవ వల్లీకుమారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 వరకు తయారీదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఇంకా ఎవరైనా తమ ఆవిష్కరణలను ప్రదర్శించాలనుకుంటే మేకర్ ఫెయిర్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలాని ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో ఆచార్య వల్లికుమారి సూచించారు. చౌక వస్తువులతో సొంతంగా రోబో తయారు చేయడం, చాకోలెట్ తయారీ, ఇంటి వద్దే పీసీబీని తయారు చేయడం, తుక్కు ఇనుము నుంచి శిల్పాల తయారీ, మట్టి బొమ్మల తయారీ, డ్రోన్ల నిర్మాణంపై శిక్షణ వంటి అంశాలపై వర్క్ షాపులు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు, పరిశోధకులు, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, ఏపీ ఉన్నత విద్యామండలి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఐబీ హబ్స్ ఎగ్జిక్యూటివ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.