ఆంధ్రప్రదేశ్‌

గ్రామదర్శినిలో నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, జూలై 26: గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించారు. గ్రామమంతా కలియదిరిగి, మహిళలు, వృద్ధుల సమస్యలు తెలుసుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన ఆయన మొత్తంగా గ్రామాభివృద్ధిపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థినులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. తొలుత గ్రామంలో రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన భూగర్భ డ్రెయినేజీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద నిర్మించుకున్న వేములపల్లి సూర్యసరస్వతి ఇంటిని ప్రారంభించారు. అదేవిధంగా పెదమంతి పేరయ్య ఇంట్లోకి వెళ్లి నిర్మాణం గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెనుమాక గంగమ్మ అనే మహిళ ఇంటిని సందర్శించగా, ఇంటి పైకప్పు సరిగా లేక ఇబ్బంది పడుతున్నానని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, తక్షణమే యాభైవేల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఐసీడీఎస్ నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని, గర్భిణుల ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కాన్పు సమయంలో తల్లి, పిల్ల క్షేమంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గర్భిణులకు పౌష్టికాహారాన్ని ముందు నుంచి అందిస్తున్నామన్నారు. ప్రతీ గర్భిణీ విధిగా ప్రభుత్వాసుపత్రిలో కాన్పు జరిపించుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించవద్దని చంద్రబాబు కోరారు. గ్రామంలోని పెనుమాక సత్తెమ్మ తన భర్త ఇటీవల మృతిచెందాడని ఆధారం లేదని పేర్కొనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి చంద్రన్న బీమా ఉంటే పరిహారం అందించాలని ఆదేశించారు.
అనారోగ్యానికి గురైన పశివేదల గ్రామ వార్డు సభ్యుడు నున్నా శేషారావు ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. శేషారావుకు ప్రభుత్వ పరంగా రూ.25వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గ్రామంలో పర్యటించిన చంద్రబాబు పారిశుద్ధ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు కెఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, సర్పంచ్ బేతిన కాశీ అన్నపూర్ణ, ఎమ్మెల్సీలు షరీఫ్, అంగర రామ్మోహనరావు తదితరులున్నారు. అనంతరం గ్రామంలో జరిగిన నాలుగు సంవత్సరాల ప్రగతి సంబంధించిన గ్రామదర్శిని పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.

చిత్రం..వృద్ధురాలి సమస్యలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి