ఆంధ్రప్రదేశ్‌

పవన్, జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలి: వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: ప్రతిపక్షనేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎంత త్వరగా తమ నోరును అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువమంత్రి నారా లోకేష్‌పై వారు చేస్తున్న అవినీతి అరోపణలను తక్షణమే నిరూపించాలంటూ సవాల్ చేశారు. వీరిరువురికి సీఎం పదవిపై ధ్యాస మినహా మరొకటి కన్పించడం లేదన్నారు. ఇక పవన్‌కళ్యాణ్ అపరిపక్వ, అవగాహన లేని నేత అన్నారు. విభజన అనంతరం ఏర్పాటైన ఈ నవ్యాంధ్రకు బాబు నాయకత్వం ఎంతో అవసరమని పవన్ నాడు చెప్పలేదా అన్నారు. అలాంటి పవన్‌కు గత నాలుగేళ్లగా కనపడని అవినీతి ఇప్పుడు కనపడిందా అని రామయ్య అన్నారు. జగన్ పెంపకంలోనే లోపం ఉందని ఆయన తక్షణం ఓ ట్యూటర్‌ని పెట్టుకోవాలని అన్నారు.