ఆంధ్రప్రదేశ్‌

ఇన్ సర్వీస్ పీఈటీలకు బీపీఈడీ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో పని చేస్తున్న ఇన్ సర్వీస్ పీఈటీలకు (యుజీపీ, ఈడీ అర్హతతో పని చేస్తున్న వారు) 2018-2020 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల కాలపరిమితి ఉన్న బ్యాచలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు చేయడానికి అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధారాణి శుక్రవారం జీఓ విడుదల చేశారు.
వరుసగా మూడు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న పిఈటీలు మాత్రమే డీఈఓల ద్వారా ఆగస్టు రెండో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని, పదవీ విరమణకు ఒక సంవత్సరం కంటే సర్వీసు తక్కువ ఉన్న పీఈటీలు అర్హులు కారని ఉత్తర్వులో పేర్కొన్నారు.