ఆంధ్రప్రదేశ్‌

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 27: విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా కేంద్రం చేసిన మోసం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు భారతీయ జనతాపార్టీ కుట్రపన్నుతుందని ఒంగోలు ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధనరావు ధ్వజమెత్తారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఇప్పటికే అభాసుపాలైన బీజేపీ తాజాగా ప్రకాశం జిల్లా పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం బీజేపీకి వెన్నతోపెట్టిన విద్యేనని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో దేశం దృష్టిలో కేంద్రం దోషిగా నిలబడటాన్ని జీర్ణించుకోలేని బీజేపీ మరోసారి ప్రాంతీయ విద్వేష అస్త్రాన్ని బయటకు తీసిందన్నారు. హోదా వేరు, రాయితీలు వేరు అంటున్న బీజేపీ ఎంపీ జీవిఎల్.. ఏపీకి ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వెనుకబడిన జిల్లా ప్రకాశం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. జిల్లాలో సుమారు 6 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమల ద్వారా 50 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
జరుగుమిల్లిలో సదరన్ ట్రిపికల్ ఫుడ్స్ కంపెనీ, మద్దిపాడులో ఈక్విటాస్ కంపెనీ, బికె ట్రెషర్స్ కంపెని, అద్దంకి కళ్లం స్పిన్నింగ్ మిల్స్, ఒంగోలు, టంగుటూరులో గ్రానైట్స్ కంపెనిలు తదితర వాటి ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. బీజేపీ నేతలు తమ కుట్రలు బహిర్గతం కావడంతో అసహనంతో రాష్ట్రప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలని జనార్ధనరావు హితవుపలికారు.