ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ ప్రత్యామ్నాయం వామపక్షాలతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 27: వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని భూమి లేని పేదలందరికి 3 ఎకరాలు సాగుభూమి అందజేయాలని వామపక్షాల రాష్ట్ర కార్యర్శులు పి మధు, కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కేంద్రంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో శుక్రవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ కార్మికుల రాష్ట్ర సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ దేశంలో రాజకీయ ప్రత్యమ్నాయం వామపక్షాలతోనే సాధ్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వ తరహాలో వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు చేసి అందరికీ వర్తింపచేయాలన్నారు. అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్యంతో పాటు కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య అందించాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు పది లక్షల వరకు బీమా వర్తింప చేయాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ అత్యవసర సమయంలో తామొక్కరే పోరాడినట్లు బిజెపి దుష్ప్రచారం నిర్వహిస్తోందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు ఎందరో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పి జైలు పాలయ్యారన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన తెలియజేసేందుకు వామపక్షాల ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నామన్నారు. వామపక్షతోనే నూతన రాజకీయ ప్రత్యమ్నాయ విధానాలు సాధ్యమన్నారు.