ఆంధ్రప్రదేశ్‌

ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 27: రేషన్ దుకాణాల ద్వారా నిరుపేదలకు అందుతున్న నిత్యావసర సరకుల సరఫరాలో డీలర్లు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల రేషన్ డీలర్ల సదస్సు విశాఖలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర బియ్యం, ఇతర నిత్యావసర సరకుల సరఫరా అత్యంత ప్రధానమైందన్నారు. నిరుపేదలకు సరకుల పంపిణీలో అవకతవకలు, మోసాలకు పాల్పడటం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడంతో పాటు పారదర్శకతకు పెద్ద పీట వేసేలా ఈ పోస్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. అయినప్పటిటీ పలు ఫిర్యాలు అందుతున్నాయని, వీటిని పరిష్కరించి ప్రజలకు మంచి సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాంతాల వారీగా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఇప్పటికే కడప, విజయవాడల్లో సదస్సులు పూర్తి చేశామన్నారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తూనే పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతున్నామన్నారు. అందుకు డీలర్లూ సహకరిస్తున్నారన్నారు. జూన్ నెలాఖారుకు ప్రజల సంతృప్త స్థాయి 77 శాతం ఉండగా, ఆగస్టు నెలాఖరు నాటికి 95 శాతానికి చేరుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్య కారణాలు, జీవన విధానాలను దృష్టిలో ఉంచుకుని రేషన్ దుకాణాల్లో తృణధాన్యాల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి పత్తిపాటి వెల్లడించారు. బియ్యం తీసుకోని వారికి కార్డులపై మూడు కిలోల చొప్పున రాగులు, జొన్నలు, సజ్జలు సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. వచ్చే సెప్టెంబర్ నుంచి వీటిని కార్డుదారులకు సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 లక్షల రేషన్ కార్డులకు సరకుల సరఫరా నిలిచిపోయిందని, క్షేత్ర పర్యటన అనంతరం వీటిని తిరిగి అంగీకరిస్తున్నామన్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలో 54 వేల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సరకులు సరఫరా చేస్తున్న 18 మంది డీలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రేషన్ డీలర్లకు కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.

చిత్రం..ఉత్తమ డీలర్లకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు