ఆంధ్రప్రదేశ్‌

ఐదు జిల్లాల్లో ప్రత్యేక మహిళా కోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 7: రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రత్యేక మహిళా కోర్టులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంతోపాటు ఆయా కేసులకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి చేసి సత్వరమే దోషులకు శిక్షలు పడేలా పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ప్రత్యేక మహిళా కోర్టులు దోహదపడనున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాలో మహిళలపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక మహిళా కోర్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసుశాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈసందర్భంగా డీజీపీ ఆర్‌టి ఠాకూర్ తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడే వారికి చట్టపరంగా శిక్షలు పడాలని, ప్రత్యేక మహిళా కోర్టులు ఏర్పాటు వల్ల లక్ష్యం నెరవేరనుందన్నారు.