ఆంధ్రప్రదేశ్‌

రామతీర్థం అభివృద్ధిని విస్మరిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 19: ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామీజీ పేర్కొన్నారు. విజయనగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రామతీర్థం అభివృద్ధికి ప్రభుత్వం 1.70 కోట్ల రూపాయలను ప్రకటించిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కేవలం రెండురోజుల వ్యవధిలో ప్రభుత్వం సీతారామ కల్యాణాన్ని రామతీర్థంలో జరిపించారన్నారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజున రామతీర్థానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. శ్రీరామ నవమి రోజున రామతీర్థంలో జరిగే సీతారామ కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. రామతీర్థంపై దేవాదాయశాఖ అధికారులు చిన్నచూపు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు రామతీర్థాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఈనెల 21న రామతీర్థంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మనవడి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి రామానందభారతి, విద్యానందభారతి, తదితరులు పాల్గొన్నారు.