ఆంధ్రప్రదేశ్‌

మరో 20 ఏళ్లకూ ‘పోలవరం’ పూర్తికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూనవరం, ఆగస్టు 10: మరో 20 ఏళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో నిర్వాసిత రైతుల సమస్యలపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర ప్రభుత్వం సాయం అందించనిదే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోకుండానే 2019 నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటు నిర్వాసితుల కాళ్లు విరగ్గొడుతూ మిగతా జిల్లాలకు సాగునీరు అందిస్తామనటం ఎంతవరకు సమంజసమన్నారు. గిరిజనుల గోడు మీకు పట్టదా అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన నిలదీశారు. నిర్వాసితులకు న్యాయం చేసేందుకే ముంపు మండలాల్లో పర్యటిస్తున్నామని, నిర్వాసితుల గోడును రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, తదితరులు పాల్గొన్నారు.