ఆంధ్రప్రదేశ్‌

పొంగి పొర్లుతున్న వాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా కృష్ణాజిల్లాలో వాగులు వంకలు గత పదేళ్లలో లేనివిధంగా పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. ఐదేళ్ల తర్వాత తొలిసారిగా మొత్తం 70గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదలుతున్నారు. 50గేట్లను మూడు అడుగుల మేర, 20గేట్లను రెండు అడుగుల మేర పైకిఎత్తి లక్షా 25వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలుతున్నారు. కృష్ణా తూర్పుడెల్టా కాలువలన్నింటినీ కట్టివేసి ప్రస్తుతానికి పశ్చిమడెల్టా కాలువలకు 4వేల క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్‌కు 156 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. తెలంగాణా ప్రాంతం నుంచి మునేరు ద్వారా లక్షా క్యూసెక్కుల వరదనీరు, తమ్మిలేరు నుంచి 16వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వస్తుంటే అనేక గ్రామాల మధ్య రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎక్కడెక్కడినుంచో కొట్టుకువస్తున్న పాముల కాటుకు గురై దివిసీమలో 40మంది అవనిగడ్డలో ప్రభుత్వాసుపత్రిలో చేరారు. విశ్వనాథపురంలో తక్షణ చికిత్స అందక ఇద్దరు మరణించారు. శాసనసభ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ అవనిగడ్డ ఆసుపత్రిలో మకాంవేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చాట్రాయి మండలంలో తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తోందని, సమీపంలోని ముసునూరు, ప.గో జిల్లా లింగపాలెం, పెదవేగి మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి, మైలవరం ప్రధాన రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వీరులపాడు మండలం తాటిగుమ్మ గ్రామంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరులో ఐదుగురు చిక్కుకోగా అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. విజయవాడ దుర్గగుడి పరిసరాల్లోనూ, చిట్టినగర్, గుణదల తదితర ప్రాంతాల్లో కొండ చెరియలు ఇళ్లపై పడగా పలు గృహాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు ప్రవహిస్తోంది. స్థానికంగా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంతో పాటు ఢిల్లీ నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితిని సమీక్షిస్తూ వివిధ శాఖలను సమన్వయపరుస్తున్నారు.

చిత్రం..ప్రకాశం బ్యారేజీ మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం