ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎంపీ విద్యకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: మహిళల హక్కు కోసం... సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య భౌతికకాయానికి సోమవారం మధ్యాహ్నం వందలాది అభిమానులు, బంధుమిత్రులు అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. బెంజిసర్కిల్‌లోని వాసవీ మహిళ మండలి నుంచి రామలింగేశ్వర నగర్‌లోని రుద్రభూమి వరకు అంతిమయాత్ర సాగింది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారితో పాటు స్థానికులు విద్య బౌతికకాయాన్ని కడసారి సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, వివక్ష నిర్మూలనకై నాస్తికోద్యమ వ్యాప్తికి ఆమె ఎంతగానో దోహదపడ్డారని, నాస్తిక సమాజం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి అరుణ్‌కుమార్ అన్నారు. ఆమె మరణం మహిళ ఉద్యమాలకు తీరనిలోటని ఏపీ మహిళ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనె్మత్స దుర్గ్భావానీ అన్నారు. అంతిమవీడ్కోలు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల, వడ్డే శోభనాద్రీశ్వరరావు, జడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ, మాజీ మేయర్ తాడి శకుంతల, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ గౌతంసవాంగ్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీపార్థసారధి, ఫాదర్ కోషి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.