ఆంధ్రప్రదేశ్‌

భోగాపురం టెండర్లలో అవినీతి కేంద్రానికి సోము వీర్రాజు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భోగాపురం విమానాశ్రయ నిర్మాణ టెండర్ల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పౌర విమాన యాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. మంగళవారం వీర్రాజు విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి వ్యవహారాలపై కోర్టులను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ టెండర్ల వ్యవహారంలో తెలుగుదేశం ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. ఎయిర్ పోర్టు నిర్మాణం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు దక్కిన టెండర్లను ప్రభుత్వం రద్దు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో విమానాశ్రలు రెండు విధానాల్లో నడుస్తున్నాయని, ఒకటి ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తే, మరొకటి ప్రైవేటు రంగంలో గ్రీన్‌ఫీల్డ్ విధానంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుల నిర్వహణలో యూజర్ చార్జీల పేరుతో నిరంతరం దోపిడీ చేస్తున్నారని ఆయన చెప్పారు. తమకు నచ్చిన ప్రైవేట్ సంస్థల కోసం ఇతర సంస్థలు టెండర్లలో పాల్గొనకుండా ప్రభుత్వం నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను పాల్గొనకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజుపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.