ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడులే ఆకర్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఈ నెల 9 నుండి 13 వరకూ రష్యా, కజికిస్థాన్‌లలో పర్యటించనుంది. చైనా పర్యటన విజయవంతం కావడంతో మంచి ఊపుమీద ఉన్న చంద్రబాబు రష్యా పర్యటన ద్వారా మరిన్ని పరిశ్రమలను రాబట్టుకోవాలని యోచిస్తున్నారు. పనిలో పనిగా అమరావతి నిర్మాణంలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టనున్నారు. కజికిస్థాన్ రాజధాని నగరం ఆస్తాన్ కొత్తగా కట్టిన నగరం కావడంతో దానిని కూడా చంద్రబాబు బృందం తిలకిస్తుంది. ఆ నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రస్తుత రక్షణ మంత్రి ఇమాంగలి టాస్‌మగంబెటోవ్‌తో కలిసి మాట్లాడతారు. ఇండస్ట్రియల్ ట్రేడ్ ఫెయిర్ ఇన్నోప్రోమ్ -2016లో సిఎం బృందం పాల్గొంటుంది. ఈ కార్యక్రమానికి భారత్ నుండి దేవేంద్ర ఫడ్నవీస్, రాజస్థాన్ నుండి వసుందర రాజే సహా గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రతినిధి బృందాలు హాజరు కానున్నాయి. 9వ తేదీన ఎపి బృందం కజకిస్థాన్ రాజధాని అల్మాటీ చేరుకుని పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తుందని ఎపి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు. ఈ బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అజయ్‌జైన్, సిసిడిఎంసి ఎండి డి లక్ష్మీపార్ధసారధి, ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీనారాయణ, ఇడిసి సిఇఓ జాస్తి కృష్ణ కిశోర్, సిఎం పిఎస్ పెండ్యాల శ్రీనివాసరావు, సిఎస్‌ఓ కూచిపూడి నగేష్ బాబు ఉన్నారు. 75 దేశాల నుండి వచ్చే పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను, సాంకేతిక ఆవిష్కర్తలను కలుసుకుని వారితో ఈ బృందం చర్చిస్తుంది.
అనంతరం రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌కు ఈ బృందం వెళ్లి 7వ అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శన ప్రారంభ వేడుకల్లో పాల్గొంటుంది. రష్యా రాజకీయ వేత్త డెనిస్ వెలంటినోవిచ్ మాంచురోవ్‌తో కూడా ఆంధ్రా బృందం భేటీ అవుతుంది.