ఆంధ్రప్రదేశ్‌

వరద బాధితులకు 20 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/చిత్తూరు, ఆగస్టు 21 : కేరళ లోని వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఆవరణలో కేరళ బాధితుల కోసం 20 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం లోడు చేసిన లారీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పది టన్నులు, జిల్లా పరిశ్రమ కేంద్రం ద్వారా పది టన్నుల ఉప్పుడు బియ్యం కేరళ రాష్ట్రంలోని వరద బాధితులకు ఉపశమనం కోసం పంపుతున్నామన్నారు.
ఇదిలావుండగా కేరళ వరద బాధితుల సహాయార్థం చిత్తూరు జిల్లా నుంచి విరాళాలు ద్వారా సేకరించిన వస్తు సామాగ్రి మంగళవారం కేరళలో బాధితులకు చిత్తూరు రెవెన్యూ ఉద్యోగులు అందజేశారు. ఒక్క రోజు వ్యవధిలోనే బాధితులకు తక్షణం అవసరమైయ్యే సుమారు రూ 50లక్షల విలువైన నిత్యావసర వస్తువులు, మందులు, బట్టలను విరాళంగా అందించారు. ఈ విరాళాల సామగ్రిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి సోమవారం మూడు లారీల ద్వారా కేరళ తీసుకెళ్లారు. మంగళవారం ఈసామగ్రిని కేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లా కడవతర ప్రాంతంలో ఉన్న ఇండోర్ స్టేడియం వద్ద ఆ రాష్ట్ర సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎర్నాకులం జిల్లా వరద సహాయక బృందం ప్రత్యేక అధికారి రాజమాణిక్యంకు అప్పగించారు. ఎర్నాకులం ప్రత్యేక అధికారి రాజమాణిక్యం చిత్తూరు కలెక్టర్ చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యనమల ఫౌండేషన్ రూ. 2 లక్షల విరాళం

విజయవాడ, ఆగస్టు 21: కేరళ వరద బాధితులకు యనమల ఫౌండేషన్ తరఫున రెండు లక్షల రూపాయలను రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు విరాళంగా ప్రకటించారు. కేరళ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఉదారంగా ముందుకు వచ్చి ఆదుకోవాలని, జరిగిన నష్టంతో పోలిస్తే, ప్రకటించిన ఆర్థిక సాయం 600 కోట్ల రూపాయలు తక్కువని తెలిపారు.