ఆంధ్రప్రదేశ్‌

లక్ష్యాలను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 21: అన్ని ప్రభుత్వ శాఖల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గ్రామదర్శిని, వివిధ శాఖల పురోగతి, కేంద్ర సాయం, తదితర అంశాలపై మంగళవారం సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకున్నాం.. వనరులను ఎంతమేర సమర్థవంతంగా వినియోగించుకుంటే అంత త్వరగా పనులు పూర్తిచేయగలమని ఉద్ఘాటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా ముందంజలో ఉన్నామని గుర్తుచేశారు. నాలుగేళ్లుగా వివిధ రంగాల్లో 511 అవార్డులు సాధించామన్నారు. జీవన ప్రమాణాల్లో నాణ్యత పెరగాలని ఆకాంక్షించారు ఆహారం, మంచినీరు, వైద్యం, విద్య, విద్యుత్‌లో నాణ్యతే ఇందుకు కొలమానాలని చెప్పారు. నాలుగేళ్లలో సగటున 10.5 శాతం వృద్ధిరేటు సాధించాం.. దీన్ని ప్రతి ఏటా 12 శాతానికి పెంచాలని నిర్దేశించారు. సురక్షిత నగరాల్లో దేశంలోనే తిరుపతి రెండో స్థానంలో ఉందని, మెరుగైన జీవన నగరాల్లో తిరుపతి, విజయవాడ అగ్రస్థానాల్లో నిలిచాయని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో కూడా మనమే ముందు నిలిచామని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామదర్శిని విజయవంతంగా జరుగుతోందని తెలిపారు. డిసెంబర్ కల్లా అన్ని గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరిలో జరిగే జన్మభూమిలో ప్రజలముందు వాటిని ఉంచి పరిష్కరించాలని సూచించారు. మండల, గ్రామ, జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు రూపొందించాలన్నారు. ఇందులో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుందామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఐఎంఆర్, ఎంఎంఆర్‌ను మరింత తగ్గించాలని కోరారు. చిన్నారులు, మహిళల్లో పౌష్టికాహార లోపం నివారించాలన్నారు. భారీ వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రతి 4వ శనివారం పెద్దఎత్తున మొక్కలు నాటటం ద్వారా హరితాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నారు. వేస్ట్‌టు ఎనర్జీ ప్లాంట్లకు భూముల కేటాయింపు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వీధి దీపాలు, సోక్‌పిట్స్, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ‘నైపుణ్య వికాసం’ కార్యక్రమం చేపట్టాం.. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రతి జిల్లాకు రూ 10 కోట్ల చొప్పున 130 కోట్ల రూపాయలు కేటాయించామని వీటిని యువత సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 6లక్షల 25వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం.. వచ్చే జనవరికల్లా మరో 6లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు. చంద్రన్న బీమా పరిహారం బాధిత కుటుంబాలకు సకాలంలో అందించాలని ఆదేశించారు. పోలీసు ప్రాథమిక దర్యాప్తు పత్రాలు వెంటనే మంజూరు చేయాలని సూచించారు. గత ఏడాది కంటే కేంద్ర నిధుల వినియోగంలో ఈ ఏడాది ముందున్నామని తెలిపారు. ఈ ఏడాది సీఎస్‌ఎస్ కింద 52 స్కీములకు గాను ఇప్పటి వరకు 8వేల 921 కోట్ల రూపాయలు వినియోగించామని చెప్పారు. దీన్ని మరింత పెంచాలన్నారు. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి కృషి సంచారుూ యోజన, స్వచ్ఛ్భారత్ విషన్ (అర్బన్), మాతృవందన యోజన, ఫుడ్ సెక్యూరిటీ మిషన్, అంగన్‌వాడీ సేవల నిధులను మరింత వినియోగించుకోవాల్సి ఉందన్నారు. సీఎంజీఎస్‌వైలో గత ఏడాది కేటింపులను కేంద్రం సగానికి తగ్గించిందని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా 19 స్కీములలో నిధుల వినియోగం పెరగాలన్నారు. 16 స్కీములకు రూ 1588 కోట్ల విడుదల కోసం ఇప్పటికే దరఖాస్తులు పంపామని అవి త్వరితగతిన వచ్చేలా దృష్టి సారించాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రూ 5133 కోట్లు వినియోగించాం.. లక్ష్యం మేరకు రూ 12 వేల కోట్లకు చేరుకోవాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, డీజీపీ ఆర్పీ ఠాకూర్, మంత్రులు నారాయణ, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నక్కా ఆనంద్‌బాబు వివిధశాఖల ఉన్నతాధికారులు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, సాంబశివరావు, పూనం మాలకొండయ్య, ఆదిత్యనాద్ దాస్, అజయ్‌జైన్, ఎస్‌ఎస్ రావత్, అహ్మద్‌బాబు, సంజయ్‌గుప్తా, ఏపీ భవన్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాష్, సీఎంఒ కార్యదర్శులు సాయిప్రసాద్, గిరిజాశంకర్, రాజవౌళి, ఇతర శాఖల కార్యదర్శులు హెచ్‌ఒడిలు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.