ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 21: రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లేందుకు వెనుకాడబోమని గుంటూరు టీడీపీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ స్పష్టంచేశారు. మంగళవారం తాడికొండ మండలం, లాంలోని చలపతి విద్యాసంస్థల్లో ఏర్పాటుచేసిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ జయదేవ్ పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన చట్టం - ప్రత్యేక హోదా - కేంద్రం అనుసరిస్తున్న తీరు అంశాలపై విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమానికి చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ తమ కుటుంబం స్వాతంత్య్రం రాకముందు నుంచి రాజకీయాల్లో ఉందన్నారు. మా తాత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగామని, కాంగ్రెస్ ప్రభుత్వంతో మా అమ్మ గల్లా అరుణకుమారి మంత్రిగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. విభజన సమయంలో మంత్రిగా అరుణకుమారి ఆందోళన చేసినప్పటికీ అధిష్ఠానం పట్టించుకోలేదని, హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో తాము కాంగ్రెస్‌ను వీడామని పేర్కొన్నారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగల నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని, అందుకే తమ కుటుంబం టీడీపీలో చేరిందని వివరించారు. ఎన్నికలకు ముందు బహిరంగంగానే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని, ఇందులో ఎలాంటి రహస్యం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందేతప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ మోసం చేస్తే విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో విధాలుగా కేంద్రంపై ఒత్తిడిచేసినా ఫలితం లేకపోయిందని, అందుకే ఎన్డీఏ నుండి బయటకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. కేంద్రం తీరును గమనించి విద్యార్థులు కూడా తమ పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చలపతి విద్యాసంస్థల చైర్మన్ యలమంచలి సుజిత్, ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు, విద్యార్థులు హాజరయ్యారు.

చిత్రం..విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్