ఆంధ్రప్రదేశ్‌

చిన్న సినిమాలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 21: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నతరహా చిత్ర నిర్మాణాలకు పన్నుల నుంచి వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ చిన్నతరహా సినిమాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుందని రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ వెల్లడించారు. చిన్న సినిమాలకు సంబంధించి అన్నిరకాల పన్నుల నుండి కొన్ని నిబంధనలతో మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ఉపాధి పొందుతున్న థియేటర్ల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సింగిల్‌విండో విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. చిన్న సినిమాలను బతికించడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించే వీలుకలుగుతుందన్నారు. పెద్ద హీరోలు ఏడాది ఒక సినిమా చేయడం వలన, థియేటర్స్ యజమానులు పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.కనీసం సైకిల్ స్టాండ్‌లో పనిచేసే వారికి కూడా జీతాలు చెల్లించుకోలేని దీనస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెలు,పట్టణాల్లో, మల్టిప్లెక్స్‌లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే, అన్ని షోలలో వారి సినిమాలే ప్రదర్శిస్తాయన్నారు. దీని కారణంగా చిన్న సినిమాలకు నష్టం వాటిల్లుతోందని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్న సినిమాలకు అండగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌లోపు తీసే అన్ని చిన్న చలనచిత్రాలకు పన్నుల నుండి మినహాయింపు ఇస్తామన్నారు. ఇందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. జీఎస్టీ 18శాతంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతం కూడా తొలగిస్తామన్నారు. ఏపీలో షూటింగ్‌ల కోసం ఎటువంటి ఖర్చులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. చిన్న సినిమాలకు ఏపీలోనే పోస్ట్ ప్రొడక్షన్ చేయాలనే నిబంధన మాత్రం ఉంటుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చే లెక్కల ప్రకారం రియింబర్స్ చేస్తామన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు చక్కగా చూపించే 10 చిన్న సినిమాలను ఎంపిక చేసి , ప్రతి ఏడాది వాటికి ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. చిన్న సినిమాల విషయంలో నిర్మాతలను, హీరోలను కలిసి వివరించినట్లు చెప్పారు. ఏపీలోనే షూటింగ్‌లు నిర్వహించాలని కోరామన్నారు. దీనిపై వారు సానుకూలంగా స్పందిచారని తెలిపారు. సినిమా థియేటర్స్ కొందరి చేతిలోనే ఉన్నాయన్న విషయంపై స్పందించిన ఆయన అది వాస్తవమేనని అంగీకరించారు.