ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మెట్రోపై దక్షిణ కొరియా కంపెనీల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: విశాఖ మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధుల బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆ బృందం గురువారం కలిసింది. సీఎంను కలిసిన బృందంలో మెట్రో రైలు కోచ్‌లకు వౌలిక సౌకర్యాల కల్పన, సిగ్నలింగ్ సిస్టమ్, ట్రాక్ డెవలపర్ల సంస్థల ప్రతినిధులు ఉన్నారు. సీఎంతో ఆ బృందం సమావేశమై మెట్రో ప్రాజెక్టుల్లో తమ అనుభవాలను వివరించారు. ఏపీకి విశాఖ మెట్రో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని వారికి సీఎం వివరించారు. రాష్ట్రానికే విశాఖ ఒక ఆకర్షణీయ ప్రాంతమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు కావాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, అనంతపురం కియా మోటార్స్ గురించి సీఎం వివరించారు. కియా మోటార్స్ వేగంగా నిర్మాణ పనులను చేపడుతోందని, జనవరిలో కియా అక్కడ ఉత్పత్తి చేసిన తొలికారు మార్కెట్‌లోకి రాబోతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏపీలో ఉందని, ఏపీని తమ గమ్యంగా చేసుకుని వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.