ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల మేనిఫెస్టోల్లో ఆర్టీఏ రక్షణ అంశాన్ని చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఆగస్టు 24: ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయుధంలా పనిచేస్తున్న సమాచార హక్కు చట్టాన్ని రక్షిస్తామని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చేలా ప్రజలు, జర్నలిస్టులు నాయకులను డిమాండ్ చేయాలని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీ్ధరాచార్యులు పిలునిచ్చారు. శుక్రవారం ఆయన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టాన్ని ఎవరూ నీరుగార్చవద్దని ఆయన కోరారు. చట్టంలో ఉన్న విధంగా అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో సమాచార కమిషన్‌లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన చెప్పారు. కేంద్ర కమిషన్‌లో ప్రస్తుతం నాలుగు ఖాళీలు ఉన్నాయని, నవంబర్‌లో తనతో పాటు నాలుగురు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఎనిమిది ఖాళీలు ఏర్పాడతాయని ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీపై ప్రభుత్వం స్పందించాలని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కుచట్టం కమిషనే లేదని చీఫ్‌తో పాటు 11 ఖాళీలున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీ్ధరాచార్యులు చెప్పారు. ఖాళీలు పెరిగే కొద్దీ ఉన్నవాళ్ల పై భారం పెరుగుతుందని ఆయన అన్నారు. ఖాళీలను భర్తీ చేయడం ద్వారా సమాచార హక్కు చట్టం సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. సమాచార హక్కు చట్టం వ్యవస్థను రక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం రక్షణకి కట్టుబడి ఉంటామని పాలకులతో పాటు ప్రతిపక్ష పార్టీలతో ప్రతిజ్ఞ చేయించాలని, ఆ బాధ్యతను ప్రజలు, జర్నలిస్టులు తీసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.
ఆర్టీఏని రక్షిస్తామని, బలోపేతం చేస్తామని, కమిషన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని మేనిఫెస్టోల్లో పెట్టేలా రాజకీయ పార్టీలను డిమాండ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.చిన్నచిన్న సమస్యలకు రాజకీయ నాయకులను, పైరవీకారులను, న్యాయస్థానాలను ఆశ్రయించకుండా, డబ్బులు ఎక్కువగా ఖర్చుకాకుండా, లంచాలు ఇవ్వకుండా ఆర్టీఏ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. తన పదవీ కాలంలో రాజకీయ పరమైన ఒత్తిళ్లు దరికి రాలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక మంచి పని చేసేటప్పుడు అభిమానించే వాళ్ల నుండి కూడా ఒత్తిళ్లు వస్తాయని, అలాంటివి సహజమని ఆయన సరదాగా కొట్టిపారేశారు.
అంతకు ముందు ఆయన సింహాచలేశుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు శ్రీ్ధరాచార్యుల పేరున అష్టోత్తర శథనామార్చనచేసి ఆశీర్వదించారు. కప్పస్తంభం అలింగనం చేసుకొని స్వామివారిని ప్రార్థించుకున్నారు. అధికారులు ఈయనకి ప్రసాదాలు అందించారు.