ఆంధ్రప్రదేశ్‌

శ్రీవరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఆగస్టు 24: శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లి భక్తులకు శ్రీవరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీవరలక్ష్మీదేవి అలంకారంతో ఉన్న శ్రీకనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు వేకువ జామునుండే ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. శ్రావణమాసంలో రెండో శుక్రవారం కావటంతో భక్తులు శ్రీ వరలక్ష్మీదేవిని దర్శనం చేసుకొని ఆమె ఆశీస్సులను పొందటానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నగర వాసులతోపాటు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవటానికి తరలి రావటంతో అమ్మవారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. అలంకార సామాట్ బద్రీనాథ్‌బాబు అమ్మవారిని శ్రీ వరలక్ష్మీదేవి అలంకారంతో తీర్చిదిద్దారు. దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ముందురోజే కిందిస్ధాయి సిబ్బందికి పలురకాలైన బాధ్యతలను అప్పగించారు. దీనికితోడు శుక్రవారం ఆమె స్వయంగా భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకోవటంతో ఆలయ ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకున్నారు. ఆలయంలో తెల్లవారు జామున 4 గంటలకు మొదలైన భక్తు రద్దీ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది.