ఆంధ్రప్రదేశ్‌

నేటినుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఆగస్టు 24: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి 347వ సప్తఆరాధన మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
మఠం ఆధ్వర్యంలో మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం, ప్రధాన ఆర్చి, రాఘవేంద్ర కూడలిలోని ఆర్చి. మంత్రాలయం పురవీధులను విద్యుత్ దీపాలతో అలంకించారు. శనివారం సాయంత్రం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ముందుగా గ్రామదేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం శ్రీమఠంలో ధ్వజారోహణం గావించి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం గోపూజ, అశ్వపూజ, లక్ష్మీపూజ నిర్వహిస్తారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రాలయం చేరుకునే భక్తులకు విస్తృత సౌకర్యాలు ఏర్పాటుచేశారు. విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తులకు ఉచిత భోజనం, వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు.