ఆంధ్రప్రదేశ్‌

ధర్మ పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే జీవీఎల్ దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 24: భారతీయ జనతా పార్టీ నేతలు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును పావుగా వాడుకుంటున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎల్‌కు పీడీ ఖాతాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పీడీ ఖాతాలు అధికంగా ఉన్నాయన్న వాస్తవాన్ని ఆయన గుర్తించాలన్నారు. కేంద్రంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ వేయకుండా రాష్ట్రాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోరడం అనైతికమన్నారు. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ధర్మ పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే జీవీఎల్‌తో ప్రధాని నరేంద్ర మోదీ కల్పిత, అవినీతి ఆరోపణలు చేయిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మిత్రపక్షాలైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ద్వారా ప్రభుత్వంపై అర్థరహిత విమర్శలు చేయిస్తున్నారన్నారు. రాజకీయ కక్షతో జీవీఎల్ కాగ్ రిపోర్టును వక్రీకరిస్తున్నారన్నారు. ఆంధ్రులపై నిందలు వేసి దాడులు చేస్తున్న జీవీఎల్ అసలు ఆంధ్రుడేనా అని మంత్రి పుల్లారావు ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాల అమలు కోసం తెలుగుదేశం పార్టీ ఎన్డీయే ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి రాజకీయపార్టీలన్నీ మద్దతు తెలిపాయన్నారు. దీంతో మోదీ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందన్నారు. రాష్ట్రప్రభుత్వంపై కక్ష తీర్చుకోవడానికి బీజేపీ కేంద్ర నాయకుల దర్శకత్వంలో జీవీఎల్ ఓ పథకం ప్రకారం అసత్య ఆరోపణలు ప్రచార దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాల వలన బీజేపీకి వొనగూరేదేమీ లేదన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ అమలు చేయాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని మంత్రి పుల్లారావు స్పష్టంచేశారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు