ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ-జగన్ సంబంధం పవిత్రమా... అపవిత్రమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24: బీజేపీతో వైసీపీ నేత జగన్‌కు ఉన్న సంబంధం పవిత్రమా... అపవిత్రమా తెలిపిన తర్వాత కేరాఫ్ అడ్రస్ లేని జీవీఎల్ నరసింహారావులాంటి వారు మాట్లాడాలని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనంద్‌బాబు హితవు పలికారు. భోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ.40వేల కోట్ల అవినీతి కుంభకోణం బీజేపీ మెడకు చుట్టుకుంటోందని, దానిపై ప్రధానమంత్రి గాని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గాని ఏమి చెబుతారంటూ మంత్రి నక్కా ప్రశ్నించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి ఆనంద్‌బాబు మాట్లాడుతూ బీజేపీ నేతల అసత్య ఆరోపణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. నాలుగు నెలల వరకు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కనబడని రాష్ట్ర ప్రభుత్వ అవినీతి ఇప్పుడు కనిపిస్తోందా అని అన్నారు. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కార్పొరేటర్‌గా కూడా రాష్ట్రంలో పోటీ చేస్తే గెలిచే స్థాయి లేని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తూ అబద్దాలు వల్లెవేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విమర్శించే జీవీఎల్ నరసింహారావు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వంతో విచారణ చేయించుకోవచ్చన్నారు. మేము ఏదైనా అవినీతికి పాల్పడితే అందులో బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉందన్న సంగతి తెలుసుకోవాలన్నారు. వైఎస్ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై 24 విచారణలు జరిపినా కడిగిన ముత్యంలా ముఖ్యమంత్రి బయటకు వచ్చారన్నారు. బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయి ఎట్లాగూ లేదని, అయినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తారని తగిన సమయంలో తగిన విధంగా తీర్పు ఇస్తారన్నారు. జీవీఎల్ లాంటి వారు గుడ్డ కాల్చి మీద వేసి చోద్యం చూస్తున్నారన్నారు. అమరావతి బాండ్లు భోగస్ అని, భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అసత్యం అంటారని, రాష్ట్రం అభివృద్ధి చెందటం వీరికి ఇష్టం లేదన్నారు. గుజరాత్‌లో 10.7 శాతం బాండ్లకు వడ్డీ ఇస్తూంటే రాష్ట్ర ప్రభుత్వం 10.3 శాతం చెల్లిస్తూ పారదర్శకంగా అమరావతి బాండ్లపై వ్యవహరిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ డీసీఆర్‌ను ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదని అలాంటి విషయాలపై మాట్లాడరన్నారు. అంతే కాకుండా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై సీబీఐ, ఇంటర్ పోల్ విచారణ జరుపుతారా అన్నారు. వైసీపీతో అక్రమ సంబంధాలు పెట్టుకుని రాష్ట్రంలో చీకటి రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అన్నారు.
బీజేపీతో ఉన్న సంబంధాలు బయటపెట్టకుండా కేసుల కోసం మంత్రి ప్రధాని మోదీ కాళ్లపై పడతారన్నారు. బీజేపీ రాష్ట్ర కన్నా లక్ష్మీనారాయణ గతంలో కాంగ్రెస్ హయాంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో చేసిన అవినీతి బయటకు రాకకుండా ఉండటానికి బీజేపీలో చేరారన్నారు. చరిత్రలేని జీవీఎల్ లాంటి పిల్లకాకులు వారి స్థాయి తెలుసుకుని మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రిపై ఛాలెంజ్ చేసే స్థాయి జీవీఎల్‌కు లేదన్నారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్‌తో కలసి పోటీ చేస్తారో లేదో తెలపాలన్నారు. తెలుగుదేశం పార్టీ మంచి క్యాడర్ కలిగి ఉన్న పార్టీ అని, జనసేన, బీజేపీలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు.