ఆంధ్రప్రదేశ్‌

మంచినీటి శుద్ధికి ‘మాస్టర్’ పరికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 24: చిన్నతనంలోనే సేవా దృక్పథంతో పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన మంచినీటిపై అవగాహన కల్పిస్తున్న ప్రవాసాంధ్రుడు సౌరిష్ సేవలు అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. తాను రూపొందించిన చిన్న నీటిశుద్ధి పరికరం పనితీరును ఉండవల్లి ప్రజాదర్బార్ వద్ద శుక్రవారం ముఖ్యమంత్రికి సౌరిష్ వివరించాడు. దీంతో సీఎం ముగ్ధులయ్యారు. ఈ పరికరాన్ని రాష్ట్రంలోని పాఠశాలల్లో వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. తాను భారత్‌కు వచ్చినప్పుడు మూడు రాష్ట్రాల్లో పాఠశాలలకు వెళ్లి శుద్ధమైన మంచినీటి వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు సౌరిష్ వివరించాడు. మురికినీటిలో మలినాలు, హానికరమైన బ్యాక్టీరియాను ఈ పరికరం తొలగిస్తుందని తెలిపాడు. దీని వినియోగం, పనితీరుని వివరిస్తూ పాఠశాలలకు వెళ్లి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పాడు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నీరు లభించక పోవటం మూలంగా 21 వ్యాధులు సోకుతున్నాయని వివరించాడు. అమెరికా న్యూజెర్సీలో పాఠశాల దశ దాటి హోల్మేల్ హైస్కూలు చేరిన సౌరిష్ పాఠశాల దశలో రకరకాల టీలను కాచిన అనంతరం వెలువడే వ్యర్థాల పునరుత్పత్తికి చేసిన ప్రయోగాలకు అమెరికా లోని సాయర్ కంపెనీ స్కాలర్‌షిప్ బహుకరించింది. ఆ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో పాఠశాలకు వెళ్లి విద్యార్థులు తాగుతున్న నీటిలో మలినాలను తొలగించి శుద్ధమైన మంచినీటి వాడకంపై అవగాహనకు వినియోగించాడు. ఒక్కో పరికరం సుమారు 3.5 లక్షల లీటర్ల మలిన నీటిని శుద్ధి చేస్తుంది. కుళాయి, బావి, చెరువు నీటిలో 99.99 శాతం బాక్టీరియాలను మలినాలను తొలగించడంతో కలరా, ఈకోలి వంటి వ్యాధుల బారినపడకుండా కాపాడవచ్చని ముఖ్యమంత్రికి వివరించాడు. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు ఈ నీటి శుద్ధి పరికరాన్ని ఉచితంగా అందించాలనే ధ్యేయంతో ఉన్న సౌరిష్ సేవానిరతి, ఉదారతను ముఖ్యమంత్రి ప్రశంసించారు.

చిత్రం..ప్రవాసాంధ్ర బాలుడు సౌరిష్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు