ఆంధ్రప్రదేశ్‌

సింగరేణి కార్మికులకు 29న లాభాల చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 24: సింగరేణి కాలరీస్ సంస్థ 2017-18 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన 1212కోట్ల రూపాయల లాభాల నుండి కార్మికులకు 27శాతం వాటాను ఈనెల 29వ తేదీన చెల్లించనున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1212కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన సింగరేణి కార్మికులకు 27శాతం చొప్పున సుమారు 327కోట్ల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. సింగరేణి పరిధిలోని ఆరు జిల్లాల్లో 11 ఏరియాల్లోని సుమారు 52వేల మంది కార్మికులకు సింగరేణి లాభాల వాటా అందనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ళ కాలంలో సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల నుండి కార్మికులకు 774.49కోట్ల రూపాయలను చెల్లించామన్నారు. సింగరేణి కార్మికుల గృహనిర్మాణానికి రూ 10లక్షల వడ్డీలేని రుణాన్ని చెల్లించే ప్రక్రియను వేగవంతం చేసిన్నట్లు తెలిపారు. ఐఐటీ, ఐఏఎం చదివే సింగరేణి కార్మికుల పిల్లలకు ట్యూషన్ ఫీజు చెల్లించే విధంగా సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టిందన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషి ఫలితంగా సంస్థ లాభాల బాటలో పయనిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు అవసరమైన బొగ్గును సరఫరా చేస్తోందన్నారు. ఈ ఏడాది నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు కార్మికులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కోరారు.