ఆంధ్రప్రదేశ్‌

గోదారి వరద తగ్గుముఖం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 24: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం తగ్గుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఈ దశలో బ్యారేజి వద్ద 11.40 అడుగుల నీటి మట్టం నమోదైంది. సముద్రంలోకి 9.55 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూలేని విధంగా మూడో ప్రమాద హెచ్చరికకు రెండడుగుల దూరం వరకు చేరుకున్న గోదావరి శాంతిస్తుండటంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇంకా ధవళేశ్వరం బ్యారేజీ నుండి దిగువకు వరద జలాలు భారీగానే విడుదలవుతుండటంతో ఇంకా కోనసీమ లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. అయితే నీరు తగ్గుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో సహాయ శిబిరాల నుండి బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. వారం రోజులుగా వరద నీటిలో మునిగిన ఇళ్ళల్లోకి బుదరమట్టి చేరడంతో మరొ రెండు మూడు రోజులు వరకూ ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకోనే పరిస్థితిలు కనిపించడంలేదు. బురదమయంగా మారిన ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు బాధితులు నానా అవస్థలు పడుతున్నారు.