ఆంధ్రప్రదేశ్‌

ముస్లింల అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 24: ముస్లిం మైనారిటీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసి వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈనెల 28న గుంటూరులో నిర్వహించనున్న మైనారిటీల సదస్సును పురస్కరించుకుని ఇప్పటి వరకు అమలుచేస్తున్న పథకాలు, ఇంకా చేపట్టాల్సిన అంశాల గురించి ఎమ్మెల్సీ షరీఫ్, ఎమ్మెల్యే చాంద్‌బాషా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా, ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్‌ఎం జియావుద్ధీన్‌లతో కూడిన బృందంతో ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. విద్య, వైద్యరంగం, ఆర్థిక సహకారం, స్వయం ఉపాధి పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని బృందం సభ్యులు ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడువేల మంది ముస్లిం జనాభాగల మండలం, పట్టణాల్లో శాసనసభ నియోజకవర్గాల వారీగా ఖాజీలను నియమించాలని సూచించారు. పోలీస్ ఫ్యామిలీ కౌనె్సలింగ్ కమిటీలో ముస్లిం మత పెద్దలను సభ్యులుగా నియమించాలని కోరారు. హజ్‌యాత్రకు పదివేల మంది ఉలేమాలను ప్రభుత్వపరంగా పంపాలన్నారు. రంజాన్ పండుగకు రెండురోజుల సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రికి సూచించారు. ఉర్దూ భాషాభివృద్ధి వికాసంలో భాగంగా ముస్లింలు అత్యధికంగా నివసించే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, గుంటూరు, కృష్ణాతో కలుపుకుని 7 జిల్లాల్లో ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఉర్దూ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల స్థాయిని పెంచాలన్నారు. ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. రాజకీయమైన ప్రోత్సాహం కింద ఎంపీపీ, జెడ్పీటీసీ కోఅప్షన్ సభ్యులు ఇద్దరిలో ఒకరిని ముస్లిం మహిళను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, పబ్లిక్ సర్వీస్ పాలకవర్గ కమిటీలలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మైనారిటీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి, గుటూరు, నెల్లూరు పట్టణాల్లో వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, మాజీ శాసనసభ్యులు మహమ్మద్ జానీ, ముస్లిం, మైనారిటీ ప్రముఖులు పాల్గొన్నారు.