ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రమంతటా ఉచిత వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 24: వచ్చే డిసెంబర్ నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ- ప్రగతి, రియల్‌టైం గవర్నెన్స్‌పై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్షించారు. ఈ-ప్రగతితో 34 ప్రభుత్వశాఖలు, 87 విభాగాధిపతులు అనుసంధానం అవుతున్నారని అధికారులు వివరించారు. యాప్ ఆధారిత, వాయిస్ ఆధారిత సర్వీసులు ప్రభుత్వ శాఖలకు అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు. డేటా సమీకరణ, వినియోగాన్ని మరింత పెంచి అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ డేటా అందించటానికి కొన్ని షరతులు రూపొందించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అనంతరం ఫైబర్‌నెట్ కార్యక్రమాలపై చర్చించారు. రాష్టమ్రంతటా త్వరలో ఉచిత వైఫై నెట్ వర్క్ సేవలు కల్పించాలని ఆదేశించారు. అందుకు తగిన నిధుల విడుదలకు అనుమతి మంజూరు చేశారు.
ఫైబర్ గ్రిడ్ ద్వారా వీక్షకులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే సౌకర్యాన్ని వచ్చేనెల 15వ తేదీలోగా కల్పించాలని సూచించారు. వర్చువల్ తరగతులు వెయ్యి పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని, మరో మూడువేల పాఠశాలల్లో వచ్చేనెలలోగా అందుబాటులోకి వస్తాయన్నారు. కంటెంట్ కార్పొరేషన్‌తో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్దేశించారు. డ్రోన్, టవర్ కార్పొరేషన్ల ప్రగతిపై కూడా సీఎం సమీక్షించారు.