ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం గేట్లు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 25: శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక గణనీయంగా తగ్గిపోవడంతో శనివారం నాలుగు గేట్లు మూసివేశారు. జలాశయానికి అధిక మొత్తంలో వరద రావడంతో మూడురోజుల క్రితం ఒకేసారి 8 గేట్లు ఎత్తిన అధికారులు 24 గంటల తరువాత నాలుగు గేట్లను దించివేశారు. తాజాగా శనివారం ఉదయం రెండు గేట్లు, రాత్రి మిగతా రెండు గేట్లు మూసివేశారు. శనివారం సాయంత్రం జలాశయం నీటిమట్టం 883.10 అడుగులుగా నమోదైంది. 205.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణానది నుండి 1,00,363 క్యూసెక్కులు, తుంగభద్ర నుండి 19,770 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,20,133 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 31,709 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 1600 క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ పథకానికి 24 వేల క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు.