ఆంధ్రప్రదేశ్‌

130 సీట్లతో మళ్ళీ అధికారం టీడీపీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఆగస్టు 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 130 శాసనసభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి మళ్లీ అధికార పగ్గాలను చేపట్టబోతుందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్. జవహార్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 175 స్థానాలకు 130 స్థానాలను తమ పార్టీ దక్కించుకుని ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండకూడదని, సమర్థుడైన నాయకుడు చంద్రబాబు ఉంటే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని భావిస్తూ ఏదో రకంగా ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కుర్చీ కోసం జగన్ ముద్దుల యాత్ర, పవన్ కల్యాణ్ గాలి యాత్ర, బీజేపీ దండయాత్ర చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. , తమ నాయకుడు చంద్రబాబు పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని, తమ పార్టీ చేపట్టిన ధర్మ పోరాట దీక్ష, గ్రామ దర్శిని కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు.