ఆంధ్రప్రదేశ్‌

గోప్యత అంటే రహస్యాల రక్షణ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి వ్యక్తిగత గోప్యత హక్కు వర్తించదని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ అన్నారు. పబ్లిక్ ఫోరం ఆధ్వర్యంలో విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో సమాచార హక్కుపై శనివారం జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోప్యత అంటే రహస్యాల రక్షణ కాదని, సంబంధిత మనిషి వ్యక్తిగత జీవిత వివరాలు గోప్యంగా ఉంచడం మాత్రమేనన్నారు. గోప్యతను అస్త్రంగా సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ప్రజలు ఉపేక్షించరన్నారు. వ్యక్తిగత గోప్యత అంటే కుటుంబం, పెళ్లి, సంతానం తదితర అంశాలు మాత్రమేనని, ప్రజలతో సంబంధం ఉన్న మిగిలిన అంశాలన్నీ గోప్యతగా పరిగణించలేమన్నారు. విధినిర్వహణలో తప్పులు చేసి వాటిని వ్యక్తిగత వివరాలుగా తప్పించుకోలేరన్నారు. గోప్యత హక్కును సమాచార హక్కుతో రక్షించుకోవాలి తప్ప, సమాచార హక్కును బలిపెట్టి గోప్యత ముసుగులో తప్పించుకునే ప్రయత్నాలు సరికాదన్నారు. గోప్యత సాకుగా ఆర్టీఐ చట్టాన్ని సవరిస్తే అవినీతిపరులు చట్టం నుంచి తప్పించుకుంటారన్నారు.