ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ను కలిసిన విశ్రాంత డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విశ్రాంత డీజీపీ నండూరి సాంబశివరావు స్వయంగా కలుసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం అచ్యుతాపురం మండల ధారభోగాపురం వద్ద జగన్ విడిది చేయగా, సాంబశివరావు కలుసుకున్నారు. జగన్‌ను కలిసిన సాంబశివరావు దాదాపు 15 నిముషాల పాటు ఏకాంతంగా చర్చించారు. వీరి కలయిక అనంతరం బయటకు వచ్చిన సాంబశివరావు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తూ, తమ కలయిక సాధారణమేనని, ప్రత్యేకత ఏమీ లేదంటూ దాటవేశారు. అయితే, సాంబశివరావు, జగన్ కలయికపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం స్పందించారు. సాంబశివరావు వైసీపీలో చేరే అవకాశాలున్నాయని సూచన ప్రాయంగా పేర్కొన్నారు. సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో సాంబశివరావు వైసీపీలో చేరితే మరింత బలోపేతం అవుతుందని ఆపార్టీ ప్రతినిధులు భావిస్తున్నారు. నవ్యాంధ్ర ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. అనంతరం ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సాంబశివరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ 1987లో ఏఎస్పీగా ప్రస్థానం ప్రారంభించారు. విశాఖ పర్యటనలో ఉండగానే విశ్రాంత పోలీసు అధికారి వై.ప్రేంబాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

చిత్రం..వైసీపీ అధినేత జగన్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న మాజీ డీజీపీ సాంబశివరావు