ఆంధ్రప్రదేశ్‌

అటవీ అకాడమిలో బీఎస్సీ ఫారెస్ట్రీ గ్రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 1: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్‌చెరువులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమిలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో శిక్షణకు సన్నాహాలు చేస్తున్నట్టు అకాడమి డిప్యూటీ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అకాడమిలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అగ్రికల్చర్, హార్టికల్చర్ గ్రూపుల తరహాలో ఫారెస్ట్రీ గ్రూపు కూడా ఉంటే భావితరాలకు అటవీ, పర్యావరణ విషయాలపై సదవగాహన ఉంటుందన్నారు. ఈ గ్రూపు ఏర్పాటు విషయమై జేఎన్టీయూ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇది ఆచరణ రూపం దాల్చితే రాష్ట్రంలో ఈ తరహా గ్రూపు తొలిసారి అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పేర్కొన్నారు. మానవుడి మనుగడకు అడవులు ప్రధాన ఆధారమని శ్రీనివాసరావు అన్నారు. మొత్తం భూభాగంలో 33 శాతం మేర అడవులు ఉండాలని, అయితే 22 శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉందన్నారు. దీనిని లక్ష్యం మేరకు పెంచడానికి భావితరాలకు అన్ని విధాలా సమాయత్తం చేయాల్సి ఉందన్నారు. అందుకు బి ఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు దోహదదపడుతుందని అభిప్రాయపడ్డారు. రాజమండ్రి దివాన్‌చెరువు వద్ద 2017 జనవరి 2న అటవీ అకాడమి ఏర్పాటు కాగా ఇంత వరకు 98 మంది అటవీ సిబ్బందికి శిక్షణ కల్పించామన్నారు. ప్రస్తుతం 4వ బ్యాచ్ బీట్ అధికారులు 29 మంది, 2వ బ్యాచ్ సెక్షన్ అధికారులు 30 మంది శిక్షణలో ఉన్నారన్నారు. ఈ నెల ఐదవ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీరికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించి స్నాతకోత్సవం నిర్వహిస్తారని వెల్లడించారు. అకాడమిలో 60 మందికి శిక్షణ, వసతి ఇచ్చేందుకు తగిన వసతి, ఫ్యాకల్టీ సదుపాయాలు ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసే యూనిఫార్మ్ సిబ్బందికి ఫారెస్ట్ లా, బోటనీ, జియాలజీ, సోషల్ ఫారెస్ట్రీ, ఫారెస్ట్ సర్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫారెస్ట్ ఇంజనీరింగ్ తదితర విభాగాలతో పాటు వారి విధి నిర్వహణకు తగిన రీతిలో పేరెడ్, మార్చింగ్, గార్డ్ ఆఫ్ హానర్, క్రీడల్లో కూడా శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. ఉన్నత ప్రమాణాలతో ఇస్తున్న ఈ శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విధి నిర్వహణలో మెరుగుపడాలని ఈ సందర్భంగా ట్రైనీలకు ఆయన ఉద్భోధించారు.