ఆంధ్రప్రదేశ్‌

జాతీయ పరీక్షల ప్రక్రియ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: జాతీయ ప్రవేశపరీక్షల ప్రక్రియ మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీతో పాటు మిగిలిన సంస్థలు జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల నోటిఫికేషన్లు జారీ చేశాయి. యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షకు సోమవారం నాడు రిజిస్ట్రేషన్ మొదలైంది. సెప్టెంబర్ 30 వరకూ దరఖాస్తు చేసుకునే వీలుంది. నవంబర్ 19 నుండి అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. పరీక్ష డిసెంబర్ 9 నుండి మొదలై 23 వరకూ జరుగుతుంది. ఫలితాలను జనవరి 10న ప్రకటిస్తారు. ఐఐటి జేఈఈ మెయిన్ తొలి పరీక్షను జనవరి 6 నుండి 20 వరకూ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ సోమవారం నాడు మొదలైంది. సెప్టెంబర్ 30 వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. డిసెంబర్ 17 నుండి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను జనవరి 31న ప్రకటిస్తారు. ఇక జెఈఈ మెయిన్స్ రెండో పరీక్షను ఏప్రిల్ 6 నుండి 20వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8 నుండి మార్చి 7వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మిట్ కార్డులను మార్చి 18 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జెఈఈ ఫలితాలను ఏప్రిల్ 30న ప్రకటిస్తారు. ఇక సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలను జనవరి 28న నిర్వహిస్తారు. ఇందుకు దరఖాస్తులను నవంబర్ 1 నుండి 30వ తేదీ వరకూ స్వీకరిస్తారు. అడ్మిట్ కార్డులను జనవరి 7న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను ఫిబ్రవరి 10న ప్రకటిస్తారు. నీట్ పరీక్ష మే 5న జరుగుతుంది. నవంబర్ 1 నుండి 30 వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. ఏప్రిల్ 15న హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఫలితాలను జూన్ 5న ప్రకటిస్తారు. కంప్యూటర్ ప్రాక్టీస్ టెస్టులకు 2697 కేంద్రాలను గుర్తించారు. ఎయిమ్స్ యూజీ, పీజీ ప్రవేశపరీక్షలకు సైతం ప్రీ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. ప్రీ రిజిస్ట్రేషన్ అనంతరం ఫైనల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అనంతరం అడ్మిట్ కార్డులను జారీ చేస్తామని ఎయిమ్స్ సంస్థ ప్రకటించింది.